Arjun S/O Vyjayanthi: ప్రీ-టీజర్‌లో అఫీషియల్ టీజర్ డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచేస్తున్న మూవీ టీమ్

by sudharani |   ( Updated:2025-03-12 14:59:39.0  )
Arjun S/O Vyjayanthi: ప్రీ-టీజర్‌లో అఫీషియల్ టీజర్ డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచేస్తున్న మూవీ టీమ్
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంలో విజయశాంతి (Vijayashanti) పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్‌(First look poster)తో గ్రేట్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రీ-టీజర్‌(Pre-Teaser)ను మార్చి14న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.

ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ మోడరన్ అవతార్‌(Modern Avatar)లో కనిపించారు. ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్ ల్యాండ్‌స్కేప్‌లో డైనమిక్‌గా వాక్ చేస్తూ రావడం అదిరిపోయింది. ఈ ప్రీ-టీజర్‌లో అఫీషియల్ టీజర్ (Official teaser) విడుదల తేదీని కూడా రివిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా.. మిగిలిన పార్ట్‌లు పూర్తయ్యాక, రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. కాగా.. ఈ మూవీలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

READ MORE ...

SSMB 29: ఒడిశాలో షూటింగ్.. ఉప ముఖ్య‌మంత్రి కీలక వ్యాఖ్యలు


Next Story

Most Viewed