Kiran Abbavaram: సక్సెస్‌ఫుల్ బ్యానర్‌తో చేతులు కలిపిన కిరణ్ అబ్బవరం.. అనౌన్స్‌మెంట్‌తో హైప్ పెంచిన మేకర్స్ (ట్వీట్)

by Hamsa |
Kiran Abbavaram: సక్సెస్‌ఫుల్ బ్యానర్‌తో చేతులు కలిపిన కిరణ్ అబ్బవరం.. అనౌన్స్‌మెంట్‌తో హైప్ పెంచిన మేకర్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఇటీవల ‘క’ సినిమాతో హిట్ అందుకుని తన పాపులారిటీని పెంచుకున్నాడు. ఒకేసారి ఆయన రేంజ్ పెరిగిపోవడంతో వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం, విశ్వ కరుణ్(Vishwa Karun) కాంబోలో ‘దిల్‌రూబా’మూవీ రాబోతుంది. అయితే ఇందులో రుక్సార్ ధిల్లాన్(Rukshar Dhillon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివమ్ సెల్యులాయిడ్స్(Shivam Celluloids), యాడ్లీ ఫిలిం బ్యానర్స్‌పై రవి, రాకేష్ రెడ్డి(Rakesh Reddy) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, కిరణ్ అబ్బవరం ఓ సక్సెస్ ఫుల్ బ్యానర్‌లో తన 11న సినిమాను చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. హాస్య మూవీస్(Hasya Movies) బ్యానర్‌పై 7వ చిత్రంగా రాబోతుండగా.. దీనిని రాజేష్ దండా(Rajesh Danda) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఫిబ్రవరి 3వ తేదీన జరగబోతున్నట్లు వెల్లడించారు. అలాగే టైటిల్ కూడా రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పడవలో జనాలు పోతున్న ఫొటోను షేర్ చేసి హైప్ పెంచారు. దీంతో ‘KA-11’ మూవీ గ్రామీణ నేపథ్యంలో రాబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే దీనికి ‘K-RAMP’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.



Next Story