Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్‌.. IIFA లో కన్ఫామ్ చేసిన హీరో తల్లి?

by Prasanna |   ( Updated:2025-03-12 15:12:07.0  )
Kartik Aaryan:  కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్‌.. IIFA లో కన్ఫామ్ చేసిన హీరో తల్లి?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ( Kartik Aaryan ) , హీరోయిన్ శ్రీలీల ( Sreeleela ) డేటింగ్ లో ఉన్నారంటూ చాలా రోజుల నుంచి ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే, ఈ నేపథ్యంలోనే ఇటీవలే జరిగిన IIFA అవార్డు ఫంక్షన్ లో కార్తీక్ ఆర్యన్ తల్లి తనకి కాబోయే కోడలు ఎలా ఉండాలో చెబుతూ.. చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

IIFA ఉత్సవాలకి వెళ్ళిన ఆమెను కరణ్ జోహార్ కాబోయే కోడలి గురించి ప్రశ్న అడగగా ''ఒక మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడిగా ఉంటుంది .. అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలని కోరుకుంటున్నాం'' అంటూ తెలిపారు.

అయితే, ప్రస్తుతం శ్రీలీల MBBS చదువుతుండడంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ ఒక్క జవాబుతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మరింత బలపడ్డాయి. అంటే.. కార్తీక్ తల్లి డైరెక్ట్ గా చెబితే బాగోదని ఇలా హింట్ ఇచ్చి ఉంటుందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదే కాదు, రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో శ్రీలీల కూడా మెరిసింది. అక్కడ శ్రీలీల డ్యాన్స్ చేస్తుండగా, కార్తీక్ ఆర్యన్ ఆమెను తన ఫోన్‌లో రికార్డ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా.. కార్తీక్ ఆర్యన్- శ్రీలీల కలిసి హిందీలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనిలో శ్రీలీల- కార్తీక్ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. అనురాగ్‌ బసు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని ఇంకా తెలియాజేయనప్పటికీ.. ఆషికి 2 సీక్వెల్ గా రానుందని తెలిసిన సమాచారం. ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రిలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న శ్రీలీల ఈ మూవీతో హిందీలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

READ MORE ...

నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోన్న.. రొమాంటిక్ లవ్ స్టోరీ! స్ట్రీమింగ్ ఎందులోనంటే?



👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed