Ashwini Dutt: ‘కల్కి-2’ షూటింగ్ అప్పటినుంచే.. అశ్వినీదత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)

by Hamsa |
Ashwini Dutt: ‘కల్కి-2’ షూటింగ్ అప్పటినుంచే.. అశ్వినీదత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కల్కి’(Kalki) సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. అదే ఫామ్‌తో దూసుకుపోతూ ఫౌజీ, స్పిరిట్(Spirit), కల్కి-2(Kalki-2)వంటి చిత్రాలను లైనప్‌లో పెట్టారు. వీటితో పాటు ఆయన హొంబలే ఫిల్మ్స్(Hombale Films) బ్యానర్‌పై ఓ మూడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇందులో ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ‘సలార్-2’ రాబోతుంది. అయితే ప్రభాస్ త్వరలో ‘రాజా సాబ్’(Raja Saab) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మారుతీ(Maruti) తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక ప్రభాస్ నెక్ట్స్ ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారనే దానిపై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాత అశ్వినీదత్(Aswani Dutt) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘కల్కి-2 షూటింగ్ జూన్ నుంచి మొదలు కాబోతుంది. అప్పటి నుంచే కాల్ షీట్స్ ఇచ్చారు. ఆలోపు మా హీరో మాకు తగిలాడు దుల్కర్ సల్మాన్. ఓ రెండు ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేశాము’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story