Jr NTR: రామ్ చరణ్ " జరగండి జరగండి " పాటకి ఎన్టీఆర్ స్టెప్పులు .. వీడియో అదిరిందిగా..!

by Prasanna |   ( Updated:2025-02-04 12:27:03.0  )
Jr NTR: రామ్ చరణ్  జరగండి జరగండి  పాటకి ఎన్టీఆర్ స్టెప్పులు .. వీడియో అదిరిందిగా..!
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన మూవీ " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) . సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ( S. Shankar ) డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఊహించినంత విజయం అందుకోలేకపోయింది. అయితే, ఈ మూవీలో నానా హైరానా, జరగండి జరగండి సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా, జరగండి జరగండి పాటలో చరణ్ డ్యాన్స్, కియారా అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ పాట వీడియోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని షార్ట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఓ అభిమాని జరగండి పాటకి కొత్త వెర్షన్ ఎడిట్ చేశాడు. జూ. ఎన్టీఆర్ ( జేరి. Ntr ) హీరోగా నటించిన 'నా అల్లుడు' చిత్రం లోని "కందిచేను కాడ కన్నువేసినానే" పాటలో విజువల్స్‌ని జరగండి పాటతో మిక్స్ చేసి అద్భుతంగ ఎడిట్ చేశారు. ఈ పాటలో శ్రియ, జెనీలియాతో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులేశారు. ఆ పాటని ఎడిట్ చేసిన తీరుకి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

కొంత మంది ఇదే ఒరిజినల్ వెర్షన్‌లా ఉంది.. చాలా బాగా ఎడిటింగ్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. భారీ సెట్స్ లేకుండా ఎన్టీఆర్ ఈ పాటకి ఇలా స్టెప్పులేస్తే అదిరిపోయిందంటున్నారు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. ఇటీవలే కొత్త పాటలకి పాత వీడియోలతో మిక్సింగ్ చేసి ఎడిట్ చేస్తున్నారు. వీటిని చాలా మంది చూడటంతో మంచి రీచ్ వెళ్తుంది. ఇక, ఫ్యాన్స్ కూడా వీటిని షేర్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే.. సోలో హీరోగా వచ్చి పెద్ద హిట్ కొడతాడనుకుంటే " గేమ్ ఛేంజర్‌ " తో నిరాశ మిగిలింది. ఇప్పుడు RC16 షూటింగ్‌తో చరణ్ ఫుల్ బిజీ అయ్యారు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివన్న దీనిలో కీలకపాత్ర చేస్తున్నారు.


Click Here Tweet..


Next Story

Most Viewed