- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Janhvi Kapoor: కుక్కలతో ఆ పని చేస్తున్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు హిందీలో ధడక్, బవాల్(Bawal), రూహి వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇక గత ఏడాది ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబోలో వచ్చిన ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో జాన్వీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయి తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటోంది. ‘దేవర’ షూటింగ్ జరుగుతుండగానే ఆమెకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన నటించే అవకాశం దక్కింది.
బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో రాబోతున్న ‘RC-16’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తున్నట్లు టాక్. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా, ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో కుక్కలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా తన చెల్లి ఖుషీ కపూర్ ‘నాదానియన్’(Nadanian) చూడాలని రిక్వెస్ట్ చేసింది. ఇక ఆమె తన పెట్ డాగ్స్‌ను హగ్ చేసుకోవడంతో పాటు కింద పడుకుని ఉండగా.. అవి ఆమెపైకి ఎక్కాయి. ఆ తర్వాత బాడీనీ నాకుతూ కనిపించాయి. దీంతో జాన్వీ ఏమీ చేయలేక నవ్వుతూ ఉండిపోయింది. ఇక ఈ వీడియోను చూసిన కొందరు క్యూట్ అని అంటున్నారు. మరికొందరు మాత్రం కుక్కలతో రొమాన్స్ చేస్తున్న జాన్వీ అని కామెంట్లు చేస్తున్నారు.