Jailer-2: సూపర్ స్టార్ సినిమాలో బాలయ్య బాబు ఫిక్స్..? ఈ సారి మామూలుగా ఉండదంటున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-01-17 13:54:02.0  )
Jailer-2: సూపర్ స్టార్ సినిమాలో బాలయ్య బాబు ఫిక్స్..? ఈ సారి మామూలుగా ఉండదంటున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) కాంబోలో రాబోతున్న మూవీ ‘జైలర్-2’(Jailer-2). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక జైలర్-2 నుంచి తాజాగా వచ్చిన టీజర్‌ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా జైలర్ మూవీలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఫిక్స్ అయినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మూవీ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి రజినీకాంత్‌ సినిమాకి బాలయ్య బాబు కూడా తోడైతే ఇంకా స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ సారి మామూలుగా ఉండదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed