‘RC-16’కి మంచి పని పెట్టాడంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన జగపతి బాబు.. ఆకట్టుకుంటున్న ఫైనల్ లుక్

by Kavitha |
‘RC-16’కి మంచి పని పెట్టాడంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన జగపతి బాబు.. ఆకట్టుకుంటున్న ఫైనల్ లుక్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం మైసూర్‌లో చరణ్‌పై కొన్ని కీలక మైన సన్నివేశాలు కూడా తెరకెక్కించారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. RC-16 మూవీలో ప్రముఖ నటుడు జగపతి బాబు(Jagapathi Babu) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయినట్లు జగపతి బాబు ఇన్‌స్టా వేదికగా మేకప్ చేయించుకుంటున్న వీడియో షేర్ చేశాడు. అంతే కాకుండా దీనికి.. ‘చాలా కాలం తర్వాత బుచ్చిబాబు సనా RC-16 కి మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత చాలా తృప్తిగా ఉంది’ అని జోడిస్తూ ఫైనల్‌గా తన గెటప్‌ని రివీల్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు Rc-16 బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed