- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Madhavilatha: ‘చాలా కష్టంగా ఉంది.. అయినా అనుభవించక తప్పడం లేదు’.. నటి మాధవీలత భావోద్వేగ పోస్ట్

దిశ, సినిమా: జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) గతంలో మాధవీలత(Madhavilatha)పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ మాధవీలత, జేసీ ప్రభాకర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ‘మా’కు ఫిర్యాదు చేసింది. నా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా వాల్లపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదు న్యాయ పోరాటం చేస్తాను అందుకే ఫిర్యాదు చేసానని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఇదే విషయం మాధవీలత ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ అనుభవించక తప్పడం లేదు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితిని నావిగేట్ చేస్తుంది. దాని గురించి మాట్లాడటం నాకు ధైర్యంగా ఉంది. మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా నా స్వంత ఇతరుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాను.
మా అసోసియేషన్(Maa association) నుండి మద్దతు వినడం ప్రోత్సాహకరంగా ఉంది. సినిమా వాళ్లతో నా బంధం స్పష్టంగా ఉంది. నా విలువను తగ్గించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. ఎవరూ ఆ విధంగా వ్యవహరించడానికి అర్హులు కాదు. నా మాటలను గౌరవించడం ముఖ్యం. మా అసోసియేషన్, మీడియాకు కూడా ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. అయితే నెటిజన్లు కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.