- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tamannaah: తమన్నాకు ఘోర అవమానం .. " ఆంటీ " అని పిలిచిన ఆ హీరోయిన్ కుమార్తె.. మిల్కీ బ్యూటీ రియాక్షన్ ఇదే!

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటి తమన్నా ( Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్ళు అవుతుంది. చిన్న తనంలోనే సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మిల్కీ బ్యూటీ తనదైన నటనతో అందర్ని ఆకట్టుకుంటుంది. హ్యాపీడేస్ మూవీతో ఈ బ్యూటీ తెలుగులో మంచి గుర్తింపు పొందింది.
ఆ మూవీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. సోషల్ మీడియాలోనూ తమన్నా యాక్టివ్ గా ఉంటుంది. కాగా, తమన్నా ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ( Vijay Varma ) ప్రేమలో ఉన్నట్లు, రిలేషన్ కూడా కొనసాగిస్తున్నానని తమన్నా ఓపెన్ గానే చెప్పింది.
ఇక, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. తమన్నాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. అమ్మాయిలలో కొందరికీ ఆంటీ అని పిలిస్తే అస్సలు నచ్చదు.. ఎక్కడ లేని కోపం మొత్తం చూపిస్తారు. కొంతమంది అయితే అప్పటికప్పుడే చెంప చెల్లుమనిపిస్తారు. అలాంటిది హీరోయిన్ తమన్నా ఓ అమ్మాయి భుజం తట్టి మరీ ఆంటీ అని ప్రేమగా పిలిచుకుంది. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమన్నాను అందరి ముందు ఆంటీ అని పిలవబోయి వెంటనే ఆపేసింది. అప్పుడు తమన్నా వెంటనే " ఇప్పుడు, నువ్వు నన్ను ఆంటీ అని పిలిచావా.. ? పర్లేదు ఆంటీ అనే పిలువ్ .. నాకు నో ప్రాబ్లెమ్" అంటూ కూల్ గా రియాక్ట్ అయి ఆమెతో కాసేపు మాట్లాడింది. ఈ వీడియో వైరల్ కావడంతో తమన్నా పద్దతిని చూసి నెటిజన్స్ సైతం మెచ్చుకుంటున్నారు.