Dil Raju : దిల్ రాజు ఇంట్లో 12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్

by M.Rajitha |   ( Updated:2025-01-21 14:57:15.0  )
Dil Raju : దిల్ రాజు ఇంట్లో 12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల(Tollywood Producers) ఇళ్ళల్లో పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్(IT Raids) జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు 12 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్వీసీ(SVC), మైత్రి(Mythri), వృద్ధి సినిమాస్ కు చెందిన నిర్మాతల ఇళ్ళు, కార్యాలయాల్లో అధికారులు ఇంకా తనిఖీలు జరుపుతున్నారు. మొత్తం 8 చోట్ల 55 ఐటీ అధికారుల బృందాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju), ఆయన తమ్ముడు శిరీష్(Shirish), కుమార్తె హన్సితతోపాటు పలువురు బంధువులు, భాగస్వాముల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేయించారు అధికారులు. కాగా ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed