- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jr. NTR: ఎన్టీఆర్ కు ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా ఇదే?

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ ( jr ntr ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నందమూరి కుటుంబానికి చెందిన వాడు. అయితే, ఎన్టీఆర్ మొదటి పేరు నందమూరి తారక రామారావు కాదట. ఆయన తండ్రి హరికృష్ణ తారక్ రామ్ అని పేరు పెట్టారట. అయితే, ఎనిమిదేళ్ల వయసులో వారి తాతగారు సీనియర్ ఎన్టీఆర్ తారక రామారావు అని పేరు మార్చారట.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే చిత్రంలో కలిసి నటించారు. మొదటిసారి, తెరపై ఎన్టీఆర్ కనిపించింది అప్పుడే. ఆ చిత్రంతో బాల నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఎన్టీఆర్ డాన్స్ ఎలా వేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తారక్ ఇంత బాగా డాన్స్ వేయడానికి వాళ్ళ అమ్మ కారణం. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ బలవంతంగా ఆయనకు కూచిపూడి నేర్పించేదట. దాని వలనే ఇప్పుడు గొప్ప డాన్సర్ అయ్యాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తనకి బాగా నచ్చిన మూవీ గురించి చెప్పాడు. ఇప్పుడు, ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) నటించిన " తొలిప్రేమ " ( Tholi Prema ) సినిమా అంటే తనకు చాలా ఇష్టమని గతంలో ఎన్టీఆర్ చెప్పారు. 1998 లో విడుదలైన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా, కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. స్వచ్ఛమైన ప్రేమ కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. ఎన్టీఆర్ ఈ చిత్రం అంటే ఇష్టమని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇక, ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల నటించిన దేవర మూవీ పెద్ద హిట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.