- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుణ్-లావణ్య మధ్య విభేదాలకు కారణం అదేనా.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే వివాహ బంధంలోకి అడుగుపెట్టాక లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరమైంది. ఇటీవల ఆమె ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఏ కొత్త సినిమా ప్రకటించలేదు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. వరుస సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మట్కాతో రాబోతున్నాడు.
దీంతో వరుణ్ ఇటు ఆపరేషన్ ప్రమోషన్స్, మట్కా షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్-లావణ్య మధ్య విభేదాలు మొదలైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం లావణ్యను వరుణ్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. కొత్త పెళ్లి కూతురు తనకు టైమ్ కేటాయించడం లేదని అలిగిందట. వీరిద్దరి మధ్య గొడవలైనట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతూ సమంత-నాగచైతన్యలా అవుతారా? అని అనుమానపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం షూటింగ్ పనుల వల్ల ఎక్కువ సమయం కేటాయించకపోయినా ఎంతో కొంతసేపు భార్యతో గడుపుతాడు. భార్యాభర్త అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం అంటూ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
Read More..
ఓటీటీలో దూసుకుపోతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 18 దేశాల్లో ట్రెండింగ్..