- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Allari Naresh: ‘బచ్చలమల్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

దిశ, వెబ్‌డెస్క్: సుబ్బు మంగదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’(Bacchalamalli). ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు అల్లరి నరేష్(Tollywood senior actor Allari Naresh) కీలక పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబరు 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రంలో అమృత అయ్యర్(amrutha ayyar) కథానాయికగా నటించింది. అయితే నిన్న (డిసెంబరు 17) హైదరాబాదు(Hyderabad)లో బచ్చలమల్లి ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మూవీ టీమ్ హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ అల్లరి నరేష్ మాట్లాడుతూ.. కామెడీ సినిమాలు చూస్తే ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని.. వావ్ మూవీ బాగుందంటూ గేట్ దాక వెళ్లేవరకే మాట్లాడకుంటారని అన్నారు.
కానీ ఈ బచ్చలమల్లి చిత్రం అలా కాదని.. ఇంటికెళ్లాక కూడా పలు సన్నివేశాలు గుర్తొస్తుంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ ఓ బచ్చలమల్లి ఉంటాడని.. నిజంగా స్టోరీ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందని వెల్లడించారు. హావభావాల నుంచి ఫైట్స్ వరకు ప్రతి విషయంలో అల్లరి నరేష్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడని పేర్కొన్నారు. అలాగే కామెడీ అండ్ మరోవైపు కంటెంట్ మూవీస్ బ్యాలన్స్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏమీ లేదని కానీ కామెడీ మాత్రం తనకు ఉప్పల్ స్టేడియంలా హోమ్ గ్రౌండ్, తనకు బలమని వదిలిపెట్టే చాన్సే లేదని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.