పవన్ కళ్యాణ్,ప్రభాస్ ఇష్టం.. అలాంటి పాత్రలు చేస్తానంటూ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
పవన్ కళ్యాణ్,ప్రభాస్ ఇష్టం.. అలాంటి పాత్రలు చేస్తానంటూ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి(Mimoh Chakraborty) ‘నేనెక్కడున్నా’ సినిమాతో తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఎయిర్ టెల్ ఫేం సషా చెత్రి హీరోయిన్. కేబీఆర్‌ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. మాధవ్ కోదాడ(Madhav Kodada) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా మిమో చక్రవర్తి తెలుగు మీడియాతో ముచ్చటించారు. ‘‘ఫైనల్లీ ఫిబ్రవరి 28న ‘నేనెక్కడున్నా’ విడుదల కావడం సంతోషంగా ఉంది. మాధవ్ కోదాడ ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అయితే, ఇది ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. దీని కోసం ఎంతో కష్టపడ్డారు. నాలుగేళ్లు దీని కోసం టైం ఇచ్చారు. సినిమా విడుదల వరకు వచ్చిందంటే కారణం ఆయనే. ఆయనకు కేబీఆర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది.

విక్రమ్ భట్ వంటి గొప్ప దర్శకులతో పని చేశా. వాళ్ళు నటించి చూపించేవారు. మాధవ్ కోదాడ కూడా అంతే! ఆయన సీన్ వివరించిన తర్వాత ఎలా నటించాలనేది ఆర్టిస్టులకు వదిలేస్తారు. అయితే నేను నా చైల్డ్ హుడ్ అంతా సౌత్ మూవీస్ చూస్తూ గడిపా. ఊటీలో మా నాన్నకు హోటల్ ఉంది. నేను అక్కడ ఉన్నాను. అందువల్ల, తెలుగు - తమిళ సినిమాలు చూస్తూ పెరిగా. విలన్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అనుకుంటున్నాను. నటుడిగా నన్ను నేను పరిమితం చేసుకోవాలని అనుకోవడం లేదు. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ. నాకు ఇష్టమైన హీరోలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ప్రభాస్, దళపతి విజయ్(Thalapathy Vijay), రజనీకాంత్(Rajinikanth) అంటే ఇష్టం. మిగతా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed