Sukumar: అల్లు అర్జున్‌తో సుకుమార్ ప్రయాణం ఏ చిత్రంతో మొదలైంది.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anjali |   ( Updated:2024-12-03 05:20:46.0  )
Sukumar: అల్లు అర్జున్‌తో సుకుమార్ ప్రయాణం ఏ చిత్రంతో మొదలైంది.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ అవైటెడ్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 వీక్షించేందుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ పాన్ ఇండియా లెవల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు(Pre-release events) నిర్వహిస్తున్నారు. నిన్న (డిసెంబరు 2) హైదరాబాదు(Hyderabad)లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ కార్యక్రమం జరిపారు. ఈ ఈవెంట్‌కు మూవీ టీమ్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్(Famous director Sukumar).. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌(Iconstar Allu Arjun)తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్య చిత్రంతో బన్నీ.. మంచి వ్యక్తిగా, నటుడిగా ఎలా సినీ కెరీర్‌లో ఎదుగుతున్నాడో గమనిస్తూ వస్తున్నానని వెల్లడించారు. పుష్ప రెండు భాగాలు తీయడానికి కూడా అల్లు అర్జున్‌పైనున్న ప్రేమేనని వెల్లడించారు.

షూటింగ్‌లో ఏదైనా సీన్స్ చేసేటప్పుడు బన్నీ నాకిచ్చే ప్రోత్సాహం బాగా నచ్చుతుందని అన్నారు. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఒక ఉత్సాహం, ఎనర్జీ ఇచ్చిపుచ్చుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ వింటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాకుండా రీసెంట్‌గా జరిగిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో కూడా బన్నీ.. నేనిక్కడ ఉన్నానంటే దానికి కారణం సుకుమార్ అని స్టేజీపై అందరిముందు చెప్పిన విషయం తెలిసిందే. ఇక పుష్ప పార్ట్- 1 కంటే రెండో భాగం భారీ విజయం అందుకోవాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికన పోస్ట్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇక పుష్ప-2 లో ఫాహద్ ఫాజిల్(Fahad Fazil), సునీల్(Sunil), అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj), జగపతి బాబు(Jagapathi Babu), రావు రమేశ్(Rao Ramesh) ముఖ్య పాత్రల్లో నటించారు.

Read More : Pushpa -2 విడుదల కాకముందే పార్ట్-3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఖుషిలో ఫ్యాన్స్!

Advertisement

Next Story

Most Viewed