- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మళ్లీ జన్మంటూ ఉంటే ఆ హీరోయిన్‌లా పుడతా.. స్టార్ డైరెక్టర్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్‌లు కాదు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టి సత్తా నిరూపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవిని కలిసి స్టోరీ చెప్పేశారని.. దానికి మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా విశ్వక్‌సేన్(Vishwak Sen) హీరోగా నటిస్తోన్న లైలా మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిపారు. ఈ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టే అవకాశం ఉంటే.. ఏ హీరోయిన్‌గా పుట్టాలని కోరుకుంటారు? అని యాంకర్ సుమ.. అనిల్‌ను ప్రశ్నిస్తుంది. దానికి అనిల్ స్పందిస్తూ.. అప్పట్లో అయితే శ్రీదేవి(Sridevi) లాగా, ఇప్పుడైతే తమన్నా(Tamannaah Bhatia) లాగా పుట్టాలని కోరుకుంటా’ అని ఆన్సర్ చేస్తారు. దీంతో ఫంక్షన్‌కు వచ్చిన ఫ్యా్న్స్ అంతా అరుపులు కేకలతో హోరెత్తిస్తారు.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. కల్యాణ్ రామ్‌తో చేసిన పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్‌గా పని చేశాడు. పటాస్ నుంచి మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సూపర్ హిట్‌లు తీసి తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి నిరూపించుకున్నారు. వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ.300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు.