ఆ డ్రింక్ యాడ్‌లో మెగా హీరో.. యూత్ ఫుల్ ఎనర్జీ అంటూ పొగడ్తలు చేస్తున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |
ఆ డ్రింక్ యాడ్‌లో మెగా హీరో.. యూత్ ఫుల్ ఎనర్జీ అంటూ పొగడ్తలు చేస్తున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ముకుంద’(Mukundha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతను.. ‘కంచె’(Kanche) మూవీతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నాడు. అయితే చివరిగా నటించిన ‘మట్కా’(Matka) మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో మంచి బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్నడూ ట్రై చేయని జోనర్‌తో మన ముందుకు రాబోతున్నాడు.

రీసెంట్‌గా అతని పుట్టినరోజు సందర్భంగా న్యూ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వీటీ-15’(VT-15) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మార్చి నెల నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. కాగా ఇండో - కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్‌తో రాబోతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కాగా ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ తాజాగా స్ప్రైట్(Sprite) కూల్ డ్రింక్‌కి యాడ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘స్ప్రైట్ తాగు చిల్ అవ్వు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వరుణ్ అన్నలో యూత్ ఫుల్ ఎనర్జీ కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed