- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీ కన్నీళ్లు చూసి వాళ్ళు జాలిపడితే 10 సార్లు మరణించినట్లే.. సెన్సేషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్

దిశ, సినిమా: జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) గతంలో మాధవీలత(Madhavi Latha)పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ మాధవీలత, జేసీ ప్రభాకర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ‘మా’కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో అతనిపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా మాధవీలత తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ..
‘నాకు గంగాధర శాస్త్రి గారితో మాట్లాడే చాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా నేను అతన్ని కలిసి నమస్తే.. నేను మాధవీలత అని అన్నాను. అప్పుడు అతను హా నాకు తెలుసు. నిన్ను చూస్తే రుద్రమదేవిలా అనిపిస్తావు. కానీ నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నాకు నచ్చలేదు, ఎందుకంటే కష్టాలు అందరికీ వస్తాయి. రుద్రమ దేవీకి కూడా వచ్చి ఉంటాయి. అయితే నాలుగు గోడల మధ్య ఆమె ఎన్నోసార్లు ఏడ్చి ఉండొచ్చు, కానీ బయట ప్రపంచానికి కత్తి పట్టి యుద్ధం చేసిన వీర వనిత.
నీ కన్నీళ్లు చూసి వాళ్ళు జాలిపడితే 10 సార్లు మరణించినట్లే. నువ్వు ఎప్పుడు ఏడవకూడదు, పోరాటం చేయాలి, ధైర్యంగా ఉండాలి, నీ శక్తి ఏంటో చూపించాలి. ఇంకెప్పుడు ఏడవకు. ఎందుకంటే నువ్వు అనుకుంటే చాలా చేయగలవు. ఒకసారి మన భగవద్గీత ట్రస్ట్ నీ విజిట్ చేస్తే బాగుంటుంది. సోల్ ఎవరితో కనెక్ట్ అవుతుంది చూడాలి అని అన్నార’ని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.