సినిమాలో ఆ పేరు ఉంటే హిట్ అయినట్టేనా.. టాలీవుడ్‌కి అంతగా కలిసొచ్చిన నేమ్ ఏంటో తెలుసా!

by Jakkula Mamatha |
సినిమాలో ఆ పేరు ఉంటే హిట్ అయినట్టేనా.. టాలీవుడ్‌కి అంతగా కలిసొచ్చిన నేమ్ ఏంటో తెలుసా!
X

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీ(Film industry)లోకి ఎంట్రీ తర్వాత చాలా మంది నటులు ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో చెప్పడం కష్టమే. ఇక సినిమా(Movies)ల విషయానికొస్తే ఏ మూవీ ఎప్పుడు హిట్ అవుతుందో.. ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో చెప్పడం కూడా కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు సినిమాలో కథ, సినిమా టైటిల్, చిత్రంలోని పాత్రల పేర్లను బట్టి కూడా హిట్లు, ప్లాపులు డిసైడ్ అవుతాయని విశ్వసిస్తారు. నిజమే కొన్ని మూవీలకు పేర్లతో కూడా మంచి హిట్ అందుకుంటాయి అని చెబుతుంటారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఈ పేరు ఉంటే మాత్రం సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయని అంటున్నారు. మరి ఆ పేరు ఏంటి.. ఆ పేరుతో ఉన్న సినిమాలు ఏంటి? అసలు ఆ పేరుకి ఎందుకంతా క్రేజ్ అనే విషయం గురించి తెలుసుకుందాం.

‘సీతారామం’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతారామం(Sitaramam) ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఓ అద్భుతమైన మూవీ(Movie). డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటనతో అలరించారు. ఈ సినిమాలోని సాంగ్స్, ఎమోషనల్స్ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు. హను రాఘవుపూడి డైరెక్షన్, డైలాగ్స్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టేలా చేశాయి. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర పేరు సీత. దానికి తగ్గట్టుగా అందంగా ఉంది.

విక్టరీ వెంకటేష్(Venkatesh), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోలుగా.. సమంత, అంజలి హీరోయిన్లుగా వచ్చిన మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ టైమ్ లో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి సీత పాత్రలో అద్భుతంగా నటించి అందరి మనుసులు దోచుకుంది.

హరీష్ శంకర్ దర్శకత్వం, హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘సుబ్రహ్మణ్యం ఫర్’ సేల్ సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ గా రెజీనా నటించారు. ఈ సినిమాలో రెజీనా సీత పాత్రలో నటించి మెప్పించింది.

కళ్యాణ్ విష్ణు కురసాల డైరెక్షన్ లో వచ్చిన మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Nagarjuna), రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇందులో లావణ్య త్రిపాఠి పేరు సీత. ఈ మూవీ కూడా బంపర్ హిట్ కొట్టింది.

వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘కంచె’. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పేరు సీత. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 2006లో వచ్చిన ‘గోదావరి’ మూవీలో హీరోగా సుమంత్, హీరోయిన్ గా కమలిని ముఖర్జీ నటించగా.. ఈ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర పేరు సీత. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ విధంగా సీత అనే పేరుతో వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ బాట పట్టాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో సీత పాత్రలో చాలా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


Advertisement
Next Story

Most Viewed