‘కల్కి’ సినిమాలో ఆ హీరో ఉండుంటే రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేది.. నాగ్ అశ్విన్ సంచలన కామెంట్స్

by Kavitha |
‘కల్కి’ సినిమాలో ఆ హీరో ఉండుంటే రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేది.. నాగ్ అశ్విన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఈ ఏడాది జూన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ త్వరలోనే రాబోతుంది. అయితే మొదటి భాగం షూటింగ్ టైంలో ఒక భాగం తీయాలా, రెండు భాగాలుగా చేయాలా అని సందిగ్ధంలో ఉండగా చిట్టీలు వేసి రెండు పార్టులు అనేదాన్ని ఫిక్స్ చేశాము. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు ‘లార్డ్ కృష్ణ’ పాత్రలో పూర్తి స్థాయిలో కనిపిస్తే ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసి.. ఇదివరకెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచేది. అంతేకాకుండా ఒకవేళ కల్కి సీక్వెల్‌లో ఫుల్ లెంగ్త్ గాడ్ రోల్ ఊహించుకుంటే.. పక్కా మహేష్ బాబును పెట్టేస్తాను” అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story