నా వయసు 20 అయితే ఆ పని చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేదు.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్

by Kavitha |
నా వయసు 20 అయితే ఆ పని చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేదు.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు హీరోయిన్‌గా వెండితెరను ఏలి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన నటి ప్రగతి(Pragathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం 24 ఏళ్ల వయసులోనే తన వయసున్న హీరోయిన్‌కు తల్లిగా నటించారు. క్లాస్ లుక్‌లో తల్లి, అక్క, వదిన వంటి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. అంతేకాకుండా తన నటనతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖంపై చిరునవ్వు, నిండైన రూపంతో కనిపించే ప్రగతికి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది.

50కి చేరువ అవుతున్నా ప్రగతిది చెక్కు చెదరని అందం. వయసు పైబడుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం రాజీ పడేది లేదని ఆమె చెబుతుంటారు. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయడమే కాదు, ఈ వయసులోనూ టైట్ ఫిట్‌లు, స్లివ్‌లెస్ జాకెట్లు వేసుకుని కనిపిస్తుంటారు. ఈ విషయంలో ఎవరెన్ని అన్నా తగ్గేదే లేదంటూ ఎప్పటికప్పుడు వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తుంటారు ప్రగతి. అంతేకాదు ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని ప్రొఫెషనల్స్‌కే పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ బిగినింగ్‌లో తెలుగు, తమిళ, మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించాను. ఈ క్రమంలో నాకు పెళ్లి అయింది. దీంతో మూడేళ్ల పాటు నటనకు దూరమయ్యాను. ఆ తర్వాత సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టాను. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తీరుతో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశాను. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో పెళ్లి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం జీవితంలో అతి పెద్ద పొరపాటు అని నాకు తర్వాత అర్థమైంది.

అలాగే ప్రస్తుతం పెళ్లి, తోడు ముఖ్యమే కానీ నా మెచ్యూరిటీ లెవల్‌కు సరైన వ్యక్తి దొరక్కుంటే మళ్లీ కష్టమే.. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక నువ్వు ఇలాగే ఉండు, ఇలా చెయ్ అంటూ కట్టిపడేస్తే నేను తట్టుకోలేను. ఒకవేళ నా వయసు 20 ఏళ్లు ఉంటే పెళ్లి గురించి ఆలోచించే దాన్ని. కానీ నా చేయి దాటిపోయింది. అయితే సొసైటీకి మాత్రం నేను మంచి పిల్లలను ఇచ్చాను. ఆ విషయంలో గర్వంగా ఫీలవుతాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.


Next Story

Most Viewed