- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Shraddha Srinath: ఆ విషయంలో నా మీద నాకే డౌట్ ఉండేది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్లుగా నటించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. దీంతో.. ప్రజెంట్ డాకు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. దీంతో వరుసగా మీడియాతో ముచ్చటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తన యాక్టింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఇది నా 25వ చిత్రం. నేను స్టార్టింగ్ (Starting)లో అసలు జనాలు నన్ను ఒప్పుకుంటారా.. అంగీకరిస్తారా? నేను నిజంగా యాక్టింగ్ (Acting) చేయగలనా? నాకు డౌట్ ఉండేది. చూస్తూ చూస్తూనే 25 సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు విని సైన్ చేస్తాము. అందులో ముందు సైన్ చేసినవి లేట్‌గా.. త్వరగా సైన్ చేసినవి ముందు రిలీజ్ అవుతాయి. అలా వచ్చిన ఈ 25వ చిత్రం నాకు స్పెషల్. ఇది నా లైఫ్‌కు ల్యాండ్ మార్క్ (Land mark) చిత్రంగా మారిపోయింది. ఇది బాల సర్ వల్లే నాకు సాధ్యం అయింది. ఇందులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు నేను షిరిడీలో ఉన్నా. ఈ అవకాశాన్ని దేవుడే ఇచ్చి ఉంటాడు అనిపిస్తుంది. బాలకృష్ణ సర్‌తో నటించడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.