- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాకు కోపం వస్తే ఇప్పటికీ అలా చేస్తాను.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే రీసెంట్‌గా ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది.
ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్(Antony Thattil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంట్లో అల్లరి చేస్తారా అని యాంకర్ అడుగగా దానికి కీర్తి స్పందిస్తూ.. ‘చాలా అల్లరి చేసేదాన్ని. నాకు చిన్నప్పుడు రూపాయి కాయిన్స్ నోట్లో పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా రెండు సార్లు కాయిన్లు మింగేసా. ఆ అలవాటు మానేయడానికి చాలా టైం పట్టింది.
చిన్నప్పుడు ఎవరైనా ఇంట్లో తిడితే వాళ్లు వాళ్ల రూమ్‌కు వెళ్లినప్పుడు బయట గడియ పెట్టేదాన్ని. ఈ విధంగా అమ్మను చాలా సార్లు ఏడిపించాను. ఇప్పటికీ కూడా కోపం వస్తే అలాగే చేస్తా. నా జీవితాన్ని మార్చేసిన మూవీ మహానటి. ఆ పాత్ర నాకు పెద్ద చాలెంజ్‌లా అనిపించింది. సావిత్రి(Savitri) గారిలా నటించడానికి నాకు చాలా భయం వేసింది. అంతే భయంతో నటించాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
Viral video: ఇదేం ఫ్యాషన్ రా అయ్యా.. చిరిగిన బొక్కల జీన్స్ కాదు.. ఇప్పుడు ఇదే ట్రెండ్!