- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్కామ్ అలర్ట్.. ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్(Vidya Balan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు హిందీ, బెంగాలీ, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించిన ఆమె స్టార్ నటిగా గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. గత ఏడాది రెండు సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలో.. విద్యా బాలన్‌కు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా, ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో కొద్ది రోజుల నుంచి నాకు సంబంధించిన పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవన్నీ నేను చేసినవి కాదు.. వాటిని ఏఐతో క్రియేట్ చేశారు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియోలను సృష్టించడం లేదా వ్యాప్తి చేయడంలో నా ప్రమేయం లేదు. అందులోని కెంటెంట్‌ను కూడా నేను ఏ మాత్రం అంగీకరించను. కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసే ముందు దయచేసి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఏఐ జనరేటెడ్ కంటెంట్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. స్కామ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసింది.