ఎప్పటికీ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ చేశా.. రాబిన్‌హుడ్‌పై హైప్ పెంచిన రాజేంద్రప్రసాద్

by Hamsa |
ఎప్పటికీ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ చేశా.. రాబిన్‌హుడ్‌పై హైప్ పెంచిన రాజేంద్రప్రసాద్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood). ఇందులో శ్రీలీల(Sreeleela) కథానాయికగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)సంగీతం అందిస్తున్నారు. అయితే వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ విలేకరుల సమావేశంలో రాబిన్‌హుడ్ విశేషాలు పంచుకున్నారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. రాబిన్‌హుడ్ చేశాక యాక్టర్‌గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయి. ఈ మూవీ చూశాక నేను హీరోగా చేసిన ఎంటర్ టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు ఆడియన్స్‌కు గుర్తుకు వస్తాయి. క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. జులాయి దగ్గర నుంచి వందకోట్ల దాటిన కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. నితిన్‌కి రాబిన్‌హుడ్ సినిమాతో స్టేచర్ మారబోతోంది. వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ ‘రాబిన్‌హుడ్’లో చేశాను. వెంకీ స్పెషల్‌గా ఈ క్యారెక్టర్‌ను నా గురించి రాసుకున్నారు.

వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్(Trivikram) దగ్గర అసిస్టెంట్‌గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్‌లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం,పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

Next Story