Malavika Mohanan: ఆ స్టార్ హీరోతో కలిసి ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నా: మాళవిక

by Hamsa |   ( Updated:2024-12-30 11:43:19.0  )
Malavika Mohanan: ఆ స్టార్ హీరోతో కలిసి ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నా: మాళవిక
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘ది రాజాసాబ్’(The Rajasaab) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మాళవిక వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ‘రాజాసాబ్’ గురించి కీలక విషయాలు వెల్లడిస్తోంది. తాజాగా, ప్రభాస్‌(Prabhas)పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘రాజాసాబ్ సినిమా కారణంగా నేను హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నాను.

ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి జానర్‌లో ఎప్పుడూ నటించిలేదు. ఇందులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండటం వల్ల నాకు నచ్చింది. అయితే నేను ప్రభాస్ ‘బాహుబలి’(Baahubali) మూవీ చూసిన తర్వాత నేను అభిమానిని అయిపోయాను. ఆయనతో వర్క్ చేయాలని కలలు కన్నా. అలాంటి సమయంలోనే ‘సలార్’(Salar) ఆఫర్ వచ్చింది. దీంతో నా కల నెరవేరుతుందనుకున్నా.

కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌లో భాగం కాలేదు. ఈ విషయం గురించి బాధపడుతుండగానే కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి ‘రాజాసాబ్’ కోసం ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏం ఆలోచించకుండా వెంటనే ఒకే చేశాను. ప్రభాస్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉన్నట్లు ఉంది అనుకున్నా. మొత్తానికి ఆయనలో నటించాలనే కల నెరవేరుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది.

Next Story