- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేను తెలుగు అమ్మాయిని, మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. మెగా బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, సినిమా: వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది.
బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా(urvashi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కలెక్షన్ల విషయంలో మంచి వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా. దీంతో ఈ మూవీ టీమ్ అంతా ప్రజెంట్ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ బ్లౌజ్, మిక్స్డ్ కలర్ శారీ కట్టుకొని ఫొటోస్ స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా.. “నేను మీ తెలుగు అమ్మాయిని.. ఈ సంవత్సరం ఇంత మెరుగ్గా ప్రారంభం అవుతుందని నేను అనుకోలేదు.
కానీ జనవరి నాకు ఎంత అద్భుతమైన నెలగా మారింది. ఫస్ట్ స్టార్టింగ్ వారంలో 3 ఖండాలు ప్రయాణించాను.. అత్యంత రద్దీగా, క్రేజీగా, చాలా అలసిపోయాను. కానీ సంతోషంగా & అత్యంత సంతృప్తికరంగా అనిపించింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నా మనసు సంతోషంతో నిండుగా ఉంది. మిగిలిన సంవత్సరం వరకు వేచి ఉండలేము” అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్టా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అఖండ-2(Akhanda-2)లో లేరు అంటున్నారు నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.