HIT-3: నాని 'హిట్-3'కి ఓటీటీలో భారీ ధర.. హైప్ పెంచేస్తున్న న్యూస్

by Kavitha |   ( Updated:2025-03-17 05:29:37.0  )
HIT-3: నాని హిట్-3కి ఓటీటీలో భారీ ధర.. హైప్ పెంచేస్తున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ మార్కులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను మెప్పించాడు. రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’(saripoda Sanivaaram) సినిమాతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నాడు.

ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలు చేస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ‘హిట్-3’(HIT-3) ఒకటి. ఈ మూవీలో నాని హీరోగా అండ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tipirneni) నిర్మిస్తున్నారు. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి(srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి టాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తుండగా.. మిక్కీ జె. మేయర్(Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటీటీ రైట్స్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.54కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More : రష్మికతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్

Next Story

Most Viewed