Sobhita Dhulipala: బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. అక్కినేని కోడలు రియాక్షన్ ఇదే? (పోస్ట్)

by Hamsa |
Sobhita Dhulipala: బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. అక్కినేని కోడలు రియాక్షన్ ఇదే? (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి(Athiya Shetty), సునీల్ శెట్టి(Sunil Shetty) కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘హీరో’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఓ మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2019లో సినిమాలకు దూరం అయింది. ఇక అతియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె టీమిండియా స్టార్ క్రికేటర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)ను ప్రేమించి పెద్దలను ఇప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు వివాహ బంధంలో ఒక్కటయ్యారు.

ఇక గత ఏడాది తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పూర్తిగా సోషల్ మీడియాకు కూడా దూరం అయిన అతియా శెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకుంటుంది. మళ్లీ రెండు నెలలకు ఆమె నెట్టింట ఓ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. తాజాగా, అతియా శెట్టి తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ టాప్, వైట్ స్కర్ట్ ధరించిన ఆమె సన్‌ఫ్లవర్ సింబల్‌ను జత చేసి పిక్స్‌న నెట్టింట పెట్టింది.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సైతం నైస్, ప్రెట్టీ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలకు అతిదిరావు హైదరీ(Aditi Rao Hydari), భూమి ఫడ్నేకర్, ఇలియానా(Ileana), సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), అమీ జాక్సన్(Amy Jackson) వంటి వారు స్పందించారు. అలాగే అతియా పోస్ట్‌పై అక్కినేని కోడలు నాగచైతన్య(Naga Chaitanya) భార్య శోభిత ధూళిపాళ(Sobitha Dhulipala) కూడా రియాక్ట్ అయింది. ఎగిరే పావురం, బ్లాక్ కలర్ హార్ట్ సింబల్‌ను పెట్టడం విశేషం.


Next Story

Most Viewed