Game Changer : పడిపోతే చూద్దామనుకున్నారు.. కానీ, అలా జరగకుండా మమ్మల్ని కాపాడింది అతనే అంటూ గేమ్ ఛేంజర్ నిర్మాత కామెంట్స్

by Prasanna |   ( Updated:2025-01-17 15:48:31.0  )
Game Changer : పడిపోతే చూద్దామనుకున్నారు.. కానీ, అలా జరగకుండా మమ్మల్ని కాపాడింది అతనే అంటూ గేమ్ ఛేంజర్ నిర్మాత కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) హీరోగా తెరకెక్కిన సినిమా " సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunam ). ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. మొదటి రోజు ఫస్ట్ షో రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రూ. 106 కోట్లు వసూలు చేసింది. దిల్ రాజు నిర్మాణం నుంచి ఈ సినిమాతో పాటు ‘గేమ్ చేంజర్’ కూడా విడుదల కాగా, అనుకున్నంత హైప్ రాకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కలెక్షన్స్ ను రాబట్టలేక పోయింది. ఇక , ఇదే సమయంలో రిలీజ్ అయినా వెంకీ సినిమా దిల్ రాజును ( Dil Raju ) కష్టాల నుంచి గట్టెక్కించింది.

రిలీజ్ కు ముందే పాటలు హిట్ అవ్వడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గుట్టుగానే రిలీజ్ తర్వాత టాక్ పాజిటివ్ గా ఉండటంతో నేడు ఈ మూవీకి సంబంధించి నిర్మాతలు సక్సెస్ మీట్ ని నిర్వహించారు. నిర్మాత శిరీష్ ( producer shirish ) మాట్లాడుతూ " ఈ మూవీ హిట్ అవుతుందని ముందే అనుకున్నాం కానీ, మూడు రోజుల్లో రూ. 100 కోట్లు సాధిస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ సంక్రాంతికి మాకు పెద్ద సమస్య వచ్చింది. రిలీజ్ కు ముందు డైరెక్టర్ అనిల్ మాకు ఒక మాట ఇచ్చాడు, ఈ సినిమా మీ సమస్యలన్నీ తీర్చేస్తుందని అన్నాడు, పైనుండి దేవతలు తధాస్తు అన్నట్టు ఉన్నారు. తను ఏం చెప్పాడో అదే జరిగింది. మేము పడిపోతే చూసి ఆనందించాలని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య వల్ల ఇండస్ట్రీ నుండి పారిపోతాం అనుకున్నారు, అలా జరగకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి మమ్మల్ని కాపాడాడు ’ అంటూ ఎమోషనల్ గా అయ్యారు. అయితే, ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

( Video Credit to Dil Raju YouTube channel )


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed