- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సగం మంది రాజకీయ నాయకుల్ని జైల్లో వేయాల్సిందే.. బన్నీ అరెస్ట్‌పై టాలీవుడ్ నటుడు సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి అల్లు అర్జునే కారణం అని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బన్నీ అరెస్ట్‌పై దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, కేటీఆర్, రాజాసింగ్, వైసీపీ నాయకులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలో చాలాచోట్ల చాలా సందర్భాల్లో రాజకీయ సభలు జరిగాయని ఆ సమయంలో కూడా తొక్కిసలాటలు జరిగాయని గుర్తు చేశారు. మరి వాటికి రాజకీయ నాయకుల్ని బాధ్యులను చేస్తూ అరెస్ట్ చేస్తారా..? అని బ్రహ్మాజీ ప్రశ్నించారు. ఇలా చేసుకుంటూ పోతే జైళ్లలో సగం మంది వాళ్లే ఉంటారని అభిప్రాయపడ్డారు. ‘‘దేశంలో చాల చోట్ల stamped జరిగింది .. ఎవెరినైనా arrest చేసారా ..? చేస్తే సగం మంది politians లోపల ఉండాలి ..’’ అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.