- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి బిగ్ అప్డేట్ (ట్వీట్)

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికల్లోకి రాకముందు ‘హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu), ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) వంటి భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ 50 పూర్తి కాకముందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలవడంతో పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. దీంతో షూటింగ్‌కులకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. సమయం దొరికినప్పుడల్లా తన సినిమాలు పూర్తి చేసే పని పడ్డారు. అయితే ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)దర్శకత్వంలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తోంది.
దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం నిహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులంతా ‘హరి హర వీరమల్లు’మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ప్రొమో ఫిబ్రవరి 22 విడుదల కాబోతుండగా. ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
We heard you, and we are ready to deliver a glimpse of melodious blast! 😎🕺#Kollagottinadhiro song promo drops TOMORROW at 1:20 PM! ❤️🔥#HariHaraVeeraMallu 2nd single ~ full song will be out on 24th February at 3:00 PM! 🎶 https://t.co/9jI8JUblS8
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 20, 2025