రెహమాన్ ట్యూన్‌కి గొంతు కలపనున్న గ్లోబల్ స్టార్.. క్యూరియాసిటీ పెంచుతున్న న్యూస్

by Kavitha |
రెహమాన్ ట్యూన్‌కి గొంతు కలపనున్న గ్లోబల్ స్టార్.. క్యూరియాసిటీ పెంచుతున్న న్యూస్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే స్పోర్ట్స్ డ్రామాగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్(shivaRaj Kumar), జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్ర పోషించనున్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు ఎన్నడూ చేయని ఓ పని చేయబోతున్నాడట మన రామ్ చరణ్. మరి ఇంతకీ ఆ పని మరేదో కాదండోయ్.. రామ్ చరణ్ ‘Rc-16’ మూవీలో ఓ సాంగ్ పాడబోతున్నాడట. మరి ఇందులో వాస్తవమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ రెహమాన్ ట్యూన్‌కి గ్లోబల్ స్టార్ గొంతుకలిపితే మామూలుగా ఉండదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఇప్పుడు హీరోలు తమ సినిమాల్లో పాటను పాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అలా రీసెంట్‌గా వెంకటేష్(Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’(sankranthiki Vasthunnam) సినిమాలో ‘పొంగల్’(Pongal) పాట పాడిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా తన అప్ కమింగ్ మూవీ అయినటువంటి ‘హరి హర వీరమల్లు’(Harihara Veeramallu) లో మాట వినాలి(Maata Vinali) అనే పాట పాడారు. అంతేకాకుండా గతంలో చిరంజీవి(chiranjeevi) కూడా తన సినిమాలో పాట ఆలపించిన సందర్భాలు ఉన్నాయి.


Next Story

Most Viewed