Ram Charan: చావైనా బతుకైనా అక్కడే.. వైరల్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కామెంట్స్

by sudharani |
Ram Charan: చావైనా బతుకైనా అక్కడే.. వైరల్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్-4’ (Unstoppable Season-4). ఇప్పటికే ఈ షోకు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేయగా.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూ (Interview)కు సంబంధించిన ఒక భాగం ఆహా (aha)లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక పార్ట్-2 త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్ట్-2 కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

ప్రోమో స్టార్టింగ్‌ (Promo starting0లోనే బాలయ్య బాబు మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ (Megastar) తనయుడిగా పుట్టాడు.. బాబాయ్ పవర్ స్టార్ (Power Star) పవర్‌తో పెరిగాడు.. ఇద్దరి శక్తి తోడుకుని పాన్ ఇండియా (Pan India) లెవల్‌లో మెగా పవర్ స్టార్‌గా ఎదిగాడు’ అంటూ రామ్ చరణ్ గురించి తెలిపాడు. అనంతరం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటిలో చాలా ట్రోల్స్ ఎదుర్కున్నావు. ఇప్పుడు ఇంత సక్సెస్ (Success) అందుకున్నావు. ఒకవేళ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయుంటే ఏం చేసేవాడివి అని రామ్ చరణ్‌ను బాలయ్య బాబు ప్రశ్నించగా.. ‘చావైనా బతుకైనా ఇక్కడే (ఇండస్ట్రీలోనే)’ అంటూ బదులిచ్చాడు రామ్ చరణ్. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఇదిరా మెగా పవర్ స్టార్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.





Next Story