- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game Changer: ‘గేమ్ చేంజర్’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). శంకర్ (Director Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ మూవీ 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ (Sensor) కూడా పూర్తి చేసుకున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘గేమ్ చేంజర్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.. సినిమా వ్యవధి 2:45:30. U/A సర్టిఫికెట్ వచ్చింది’ అని తెలిపారు. అంతే కాకుండా ఈ రోజు సాయంత్రం 5:04 గంలకు ట్రైలర్ (Trailer) రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కాగా.. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్లతో పాటు.. ‘నానా హైరానా’, ‘దోప్’ లిరికల్ సాంగ్స్ మంచి హిట్ అందుకున్నాయి.