- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమాను బలవంతంగా ఒప్పుకున్నా.. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది: చిరంజీవి
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’(Viswambhara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో త్రిష(Trisha), అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘డాడీ కథను నాకు వినిపించారు. వినగానే ఇది నాకంటే వెంకటేష్(Venkatesh)కు బాగుంటుందనిపించింది. ఈ కథకు తను న్యాయం చేయగలడనుకున్నా. రచయిత భూపతి రాజా(Bhupati Raja)కు ఇదే విషయం చెప్పాను. ఇది ఆయనకు మామూలుగా ఉంటుంది. మీకైతే ఫ్యామిలీమెన్గా కాస్త వెరైటీగా ఉంటుందని భూపతిరాజా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా నేను కాస్త ఆలోచించాను. ఈ కథ విన్న వారందరూ ‘చిన్న పిల్లతో ఈ సినిమా మీకు బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు.
చివరకు నేను కూడా బలవంతంగా ఒప్పుకున్నాను. రిజల్ట్ కూడా అలాగే ఉంది. కథ విన్నప్పుడు ఏమనుకున్నానో అదే జరిగింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్(Venkatesh) నాకు ఫోన్ చేసి భలే మూవీ అండీ అన్నారు. నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండీ అనేశాడు. నీకైతే బాగుండేదని నేను చెప్పాను వెంకటేష్. కానీ ఆయన వినలేదు. అలాంటి ఫెయిల్యూర్స్ నా సినీ జీవితంలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ చిరంజీవి కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.