Alia Bhatt: కొత్తగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.. అలియా భట్ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |   ( Updated:2025-03-06 07:35:19.0  )
Alia Bhatt: కొత్తగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.. అలియా భట్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’(Student of the Year) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత వరుస ఆఫర్లు అందుకుని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన అందం, అభినయం, నటనతో సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఎంతోమంది అభిమానులు దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీతగా నటించి మెస్మరైజ్ చేసింది. ఒక్క మూవీతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రాహా అనే కూతురు కూడా ఉంది. అయితే కూతురు పుట్టాక అలియా కొద్ది రోజులు సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. మళ్లీ ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది. ఇక గత ఏడాది యాక్షన్ థ్రిల్లర్ ‘జిగ్రా’(Jigra)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేదాంగ రైనా(Vedanga Raina) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. దీంతో ఏ కొత్త సినిమాను ప్రకటించకుండా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా ‘జిగ్రా’ ఫ్లాప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు నటనపై మక్కువ ఎక్కువ. ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నాను. అయితే నా వర్క్‌కు సంబంధించిన నాకు ఎన్నో కలలు ఉన్నాయి. వాటి కోసం మరింత కష్టపడుతున్నాను. అందుకే సినిమా ఫలితాలను పట్టించుకోవడం లేదు.

అవి నన్ను ప్రభావితం చేయవు. వాటి కారణంగా ఆనందంగా లేనని అనుకోను. గత ఏడాది నేను నటించిన ‘జిగ్రా’ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని కొత్తగా ప్రయత్నించాను. అయినా లాభం లేకుండా పోయింది. కానీ దాని ఫలితాన్ని చూసి నేను నిరాశపడలేదు. మరింత ఉత్సాహంగా ముందుకుసాగుతున్నాను. ఈ రంగంలో అలాంటివి కామన్. కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఉండటమే మంచిది’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement
Next Story

Most Viewed