- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Allu Arjun: అల్లు అర్జున్ అలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడా.. దేవిశ్రీ ప్రసాద్ ఏం చెప్పాడంటే..?

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన " పుష్ప " ( pushpa ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ ఒక్క చిత్రం తో అల్లు అర్జున్ గ్రాఫ్ మారిపోయింది. అప్పటి వరకు మాములు హీరోగా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ " పుష్ప 2 " ( Pushpa 2 ) కూడా వచ్చింది.
ఈ చిత్రంతో క్రియేట్ చేసిన రికార్డులు చాలా ఉన్నాయి. బాలీవుడ్ లో అయితే అల్లు అర్జున్ కి క్రేజ్ పెరిగిపోయింది. అందుకే తర్వాత చేయబోతున్న ప్రాజెక్ట్ ని అంతకుమించి తియ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, బన్నీ మనసులో మాత్రం వేరే కథ ఉందంటున్నారు దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad )
అతను ఎలాంటి సినిమా చెయ్యాలనుందో చెప్పారు దేవి శ్రీ. బన్నీ ప్యూర్ లవ్ స్టోరీని ఇష్ట పడుతున్నాడు, ఆ మూవీకి అన్నీ మంచి మెలొడీ లవ్ పాటలు ఉండాలని కోరుకుంటున్నాడు.. దీని గురించి ఆల్రెడీ దేవీతో చర్చించారని తెలిసింది. అయితే, ఇప్పుడు వరసగా యాక్షన్ మూవీస్ లైనులో పెట్టాడు. మరి, ఈ టైం లో బన్నీ ఆర్య లాంటి ప్యూర్ లవ్ స్టోరీ చెయ్యాలనుందని చెప్పడంతో నెట్టింట ఈ విషయం వైరల్ అవుతుంది.
మరి, ఇప్పటి వరకు యాక్షన్ మూవీస్ చేస్తూ ఒక దానికి మించి మరొక సినిమా ఎలివేషన్ పెంచుకుంటూ పోతున్న బన్నీ ప్రేమ కథతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అంటూ ఇమాజినేషన్ స్టార్ట్ అయ్యింది. ఇంకో వైపు పక్కా లవ్ స్టోరీ అంటే బన్నీ ఎవరితో చేస్తారో, అసలు ఆ కథ ఎలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం, అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేస్తున్నారు. మైథలాజికల్ టచ్ ఉండే మూవీ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలవుతాయని నిర్మాతలు కూడా అంటున్నారు.