- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సౌందర్య నటించి నిర్మించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా.. కేవలం అతని కోసమే ఆ పని..

దిశ, వెబ్‌డెస్క్: దివంగత హీరోయిన్ సౌందర్య(Soundarya) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ సౌందర్య అనే చెప్పవచ్చు. అయితే గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలోనే కనిపిస్తూ.. కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది. సౌందర్య మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతుంటారు. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకు చాలా మందికి సౌందర్య కేవలం హీరోయిన్‌గా నటించిందన్న సంగతి మాత్రమే తెలుసు. అయితే ఈ బ్యూటీ కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారి.. స్వయంగా నటించి ఓ చిత్రాన్ని నిర్మించింది. వివరాల్లోకి వెళితే.. సౌందర్య సినిమా కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం విదితమే. ఆమె తండ్రి సత్యనారాయణ అయ్యర్ కన్నడలో రచయిత, నిర్మాత. ఎన్నో చిత్రాలను నిర్మించారు. అయితే ఈ ముద్దుగుమ్మ తన తండ్రి వల్లే సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతుండగా.. స్కూల్లో ఉన్న సౌందర్యను తీసుకువచ్చి ఆ పాత్ర పోషించేలా చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా సౌందర్యకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత చదువు మానేసి సినిమాల్లోకి వచ్చేసింది. అలా తెలుగులో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే సౌందర్య నటిగా తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారు. ఆయన ఆకస్మిక మరణం సౌందర్యను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అప్పుడే తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకున్నారట. తాను నిర్మాతగా మారి తండ్రికి నివాళిగా ఓ సినిమా తీయాలనుకున్నారట. తన తండ్రి పేరుతో `సత్య మూవీ మేకర్స్` అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి 2002లో `తీవు` చిత్రాన్ని నిర్మించారు సౌందర్య. కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవెల్లి దర్శకత్వం వహించారు. ఇది మహిళలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సినిమా. ఇందులో సౌందర్య స్వయంగా హీరోయిన్ గా నటించడం గమనార్హం. ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.