- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Prabhas: ప్రభాస్ ఒక్కడే కాకుండా, ఆ హీరో కూడా కృష్ణం రాజు వారసుడని తెలుసా.. అతనెవరంటే..?

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎలాంటి వివాదాలు లేకుండా రెబల్ స్టార్ గా ఎదిగి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు ( Krishnam Raju ). అంత మంచి పేరు సంపాదించుకున్న ఆయన అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచారు. సినిమాల్లోకి రాక ముందు నుంచే కృష్ణంరాజుకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. 1966 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 కి పైగా మూవీస్ లో అయన నటించారు.
ఇదిలా ఉండగా, గత కొంత కాలం నుంచి ఆయనకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ (Prabhas ) ఒక్కరే కాదట. కృష్ణంరాజు కుటుంబం నుంచి మరొక వ్యక్తి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా .. ఆయన ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో సిద్ధార్థ్ రాజ్ కుమార్ ( Siddharth Rajkumar ) టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.
కృష్ణంరాజు గారి సినీ వారసుడిగా తొలిసారి " కెరటం " అనే మూవీతో అడుగు పెట్టాడు. ఇతను తెలుగు కంటే ముందు కన్నడ, తమిళ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్, హీరోగా చేశారు. ఇక తెలుగులో నటించిన " కెరటం " చిత్రం ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వకపోవడంతో టాలీవుడ్ గుర్తించలేకపోయింది. కానీ, కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడనే ట్యాగ్ లైన్ పడిపోయింది. కృష్ణంరాజు ఈ హీరోకి పెద్దనాన్న అవుతారట.