- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
RGV: నేను మీకు ఏం ద్రోహం చేశానని ఇలా అవమానిస్తున్నారు.. లైవ్‌లో షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రొడక్షన్‌లో LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’ (Sari). సత్య యాదు, ఆరాధ్య దేవీ (Aaradhya Devi) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిజజీవిత సంఘటన ఆధారాలతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్ (Teaser), ట్రైలర్ (Trailer), సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయ్యేందుకు ‘శారీ’ చిత్రం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. వరుస అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచుతున్నారు. అలాగే వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఈవెంట్ నిర్వహించగా.. అక్కడ ఓ అబ్బాయి అడిగిన ప్రశ్నకు వర్మ విచిత్రంగా రియాక్ట్ అయ్యారు.
‘నాకు ధైర్యం సరిపోవడం లేదు.. మీకు ఉన్న ధైర్యంలో నాకు కొంచెం రావాలి అంటే మీ దగ్గర హగ్ (Hugh) తీసుకోవాలి’ అనే ఓ వ్యక్తి ఆర్‌జీవి (RGV)తో అంటాడు. దీనిపై స్పందించిన ఆర్‌జీవి.. ‘నేను ఎప్పుడు మగాళ్లకు హగ్ ఇవ్వను’ అని అంటాడు. ఇక ఆ వ్యక్తి.. ఎంతసేపు అమ్మాయిలకేనా సర్.. మాకు ఇవ్వరా అని అడగ్గా.. ‘నేను మీకు ఏం ద్రోహం చేశానని నన్ను ఇంత అవమానిస్తున్నారు. నేను ఎలా కనిపిస్తున్నా మీకు. మగాళ్లను హగ్ చేసుకునేవాడిలా కనిపిస్తున్నాన’ అంటూ రిప్లై ఇచ్చాడు ఆర్‌జీవి. ప్రజెంట్ ఈ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
READ MORE ...
‘జాట్’ సినిమాలో పవర్ ఫుల్ లుక్‌లో బాలీవుడ్ నటుడు.. గ్లింప్స్ విడుదలకు టైమ్ ఫిక్స్