నటుడు సాయి కిరణ్ గురించి ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?

by D.Reddy |
నటుడు సాయి కిరణ్ గురించి ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీ నటుడు సాయి కిరణ్ (Sai kiran) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ సింగర్ రామకృష్ణ ( Singer V.Ramakrishna ) కొడుకైన సాయి కిరణ్.. 'నువ్వే కావాలి' చిత్రంతో సినీ కేరీర్ ప్రారంభి.. పలు సినిమాల్లో, సిరియల్స్‌లో నటిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే, సాయి కిరణ్ గురించి చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయమేమిటంటే? అతడు ఓ స్నేక్ రెస్క్యూలర్. ఒక వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్‌తో కలిసి ఇప్పటివరకు దాదాపు 3,000లకు పైగా పాములను రక్షించారు.

భక్తిలో భాగంగా ఆ ప్రొఫెషన్ వైపు అడుగులు వేశాడట. స్వతహాగా శివభక్తుడైన సాయి కిరణ్ పాముల్ని చంపడం అసలు ఇష్టపడేవాడు కాదట. అవగాహన లేని చాలా మంది వాటిని చంపుతుంటే చూడలేక, పాముల్ని రక్షించాలని నిశ్చయించుకున్నాడట. దాని కోసం ప్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడట.

ఆర్గనైజేషన్‌తో కలిసి హైదరాబాద్‌లో (Hyderabad) పాములను పట్టుకెళ్ళి శ్రీశైలం (Srisailam) అడవుల్లో వదిలేస్తారు. ఒక్కో గోనె సంచిలో 16 దాకా పాములను ఉంచి వాటిని ఇన్నోవా కారులో తీసుకెళ్తారట. ఈ క్రమంలో ఒకసారి అతడి కాళ్లపై రెప్పపాటు సమయంలోనే 16 పాములు పడ్డాయని ఆ క్షణంలో తాను చాలా భయపడిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో సాయి కిరణ్ తెలిపారు. ఆ సమయంలో ఒక్క పాము కాటు వేసినా ఇక తాను తన జన్మలో మరొక పామును కాపాడకూడదని అనుకున్నాడట. అయితే ఆ పాములు మాత్రం తనని ఏమీ అనకుండా పొదల్లోకి వెళ్లిపోయాయట.



Next Story

Most Viewed