Kubera: ‘కుబేర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న హీరో

by sudharani |
Kubera: ‘కుబేర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రజెంట్ హీరోగా, డైరెక్టర్‌గా రాణిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారు ధనుష్. అందులో ‘కుబేర’ (Kubera) ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, ట్రైలర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అంతే కాకుండా.. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఓ బిచ్చగాడిగా, టాలీవుడ్ స్టార్ నాగార్జున ధనవంతుడిగా కనిపించగా.. లాస్ట్‌లో ధనుష్ కుబేరుడుగా అవతారం ఎత్తుడాడు.

ఇక ఈ కాంబోలో వస్తున్న ‘కుబేర’ కాన్సెప్ట్ బిగ్ స్క్రీన్‌(Big screen)పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న విడుదల కాబోతుంది. దీంతో షూటింగ్‌లో వేగం పెంచడంతో పాటు.. వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల ఫస్ట్ సింగిల్ (First single) ప్రోమో ఏప్రిల్ 15న విడుదల చెయ్యగా.. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మాస్ బీట్‌తో స్టార్ట్ అయిన ఈ సాంగ్‌లో ఊర మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు ధనుష్. ప్రజెంట్ ఈ సాంగ్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.



Next Story

Most Viewed