‘దిల్ రూబా’ సెకెండ్ సింగిల్‌‌కు డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచుతున్నారుగా

by Kavitha |   ( Updated:2025-02-17 07:04:11.0  )
‘దిల్ రూబా’ సెకెండ్ సింగిల్‌‌కు డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచుతున్నారుగా
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో దిల్ రూబా సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘హే జింగిలి’ అనే సాంగ్ ఫిబ్రవరి 18న సాయంత్రం 5:01 గంటలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. ఆమెను గట్టిగా పట్టుకున్న హీరోను ఈ బ్యూటీ కూడా తన కళ్లలో కళ్లు పెట్టి చూస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Next Story

Most Viewed