Dandora: తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో మరో మూవీ.. నటీనటులు ఎవరంటే?

by sudharani |
Dandora:  తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో మరో మూవీ.. నటీనటులు ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘క‌ల‌ర్ ఫోటో’ (Color photo), ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Laukya Entertainments) ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ (Dandora) సినిమా రూపొంద‌నుంది. దీనికి ముర‌ళీకాంత్ (Muralikant) ద‌ర్శక‌త్వం వహిస్తుండగా.. తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ (Film Nagar) లోని రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio)లో పూజా కార్యక్రమాల‌తో లాంఛ‌నంగా స్టార్ట్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.

కాగా.. తెలంగాణ (Telangana) గ్రామీణ నేప‌థ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించ‌నున్నారు. మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్రదాయాల‌ను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చ‌క్కటి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీలో శివాజీ (Shivaji), న‌వ‌దీప్‌ (Navadeep), రాహుల్ రామ‌కృష్ణ (Rahul Ramakrishna), ర‌వికృష్ణ (Ravi Krishna), మ‌నీక చిక్కాల‌ (Maneka Chikkala), అనూష (Anusha) త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. త్వర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Advertisement

Next Story