- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘కాఫీ విత్ ఏ కిల్లర్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

దిశ, సినిమా: ఆర్‌పి పట్నాయక్(RP Patnaik) కథ, రచనా, దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’(Koffee with a Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. క్రైమ్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీ జనవరి 31 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...
‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు ఎంతో ప్రత్యేకంగా, కొత్తగా ఉంటాయి. ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాను ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్‌గా చేశాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ‘ఆహా’లో విడుదల చేస్తున్నాము. అందరూ తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు.