Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్!

by sudharani |
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ వశిష్ట (Director Vashishta) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘విశ్వంభర’ (vishwambhara). ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. గతంలో ‘విశ్వంభర’ మూవీని సంక్రాంతికి స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అదే సమయంలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రిలీజ్‌కు ఉండటంతో అప్పట్లో ‘విశ్వంభర’ రిలీజ్‌కు వాయిదా వేశారు. ఇక దీని తర్వాత చిరంజీవి సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఫిలిమ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. విశ్వంభర చిత్రాన్ని మే 09 న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

కాగా.. ఈ సోషియోఫాంటసీ (sociofantasy) చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి (Vamshikrishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి (Pramod Uppalapati) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), అషిక రంగనాథ్‌ (Ashika Ranganath), ఇషా చావ్లా (Isha Chawla), సురభి (Surabhi), కునాల్‌ కపూర్‌ (Kunal Kapoor) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


Next Story

Most Viewed