Suriya: తెలుగులో సూర్య సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by sudharani |
Suriya: తెలుగులో సూర్య సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేవలం తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పటి వరకు తెలుగు భాషలో ఒక్క చిత్రం కూడా చేయలేదు. అయితే మంచి కథ దొరికితే తెలుగులో డైరెక్ట్ మూవీ చేస్తానని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో సూర్య చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ హీరో తెలుగు అభిమానులు కూడా తెలుగులో సినిమా చేస్తే చూడాలని ముచ్చటపడుతున్నారు. ఇక త్రివిక్రమ్ (Trivikram), పూరిజగన్నాథ్ (Puri Jagannath), బోయపాటి శ్రీను (Boyapati Srinu) వంటి డైరెక్టర్‌లతో సూర్య తెలుగులో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్ కల నెరవేరినట్లు తెలుస్తుంది. సూర్య, డైరెక్టర్ చందూ మొండేటి(Director Chandoo Mondeti) డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.

‘ప్రేమమ్, కార్తికేయ, కార్తికేయ-2’ వంటి చిత్రాలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న చందూ మొండేటి ప్రజెంట్ ‘తండేల్’(Thandel) చిత్రంతో బిజీగా ఉన్నాడు. అక్కినేని హీరో నాగచైతన్య(Nagachaithanya), నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ఈ మూవీ లవర్స్ డే (Lovers Day) స్పెషల్‌గా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చందూ మొండేటి సూర్యతో సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ‘సూర్యకు రెండు కథలు వినిపించాను. ఆ రెండూ నచ్చాయని చెప్పారు. అందులో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘తండేల్’ అనంతరం సూర్యతో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండనుందని అంచన వేస్తున్నారు ప్రేక్షకులు.



Next Story