- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెలబ్రేటింగ్ పవర్ ఆఫ్ ఉమెన్ అంటూ 'శివంగి' నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi), వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శివంగి’(shivangi). దీనికి దేవరాజ్ భరణి ధరణ్(Devaraj Bharani Dharan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శివంగి సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై సురేష్ బాబు(Suresh Babu) నిర్మించారు. అయితే పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్(John Vijay) కీలక పాత్రలో కనిపించనున్నారు.
కాగా ఈ చిత్రానికి కాషిఫ్ ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి హైప్ పెంచిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఉమెన్స్ డే సందర్భంగా శివంగి నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అది ఆనంది పోస్టర్ కావడం విశేషం. ఇక ఈ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ ఉమెన్.. హ్యాపీ ఉమెన్స్ డే’ అంటూ స్పెషల్ విషెస్ తెలిపారు మేకర్స్.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. నెత్తిపై కిరీటం పెట్టుకున్న ఆనంది కొంచెం రొమాంటిక్‌గా చూస్తున్నది. అలాగే మెడలో బ్లాక్ దారానికి రుద్రాక్ష కట్టుకున్నది. అయితే లెఫ్ట్ హ్యాండ్‌లో రెడ్ రోస్‌ను తన లిప్స్‌కు దగ్గరగా ఉంచి పెదవులపై బ్లేడ్‌ను పట్టుకుంది. అలాగే బ్లాక్ టీ షర్ట్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.